Skip to content

వృషభం

(ఆదాయం-2 వ్యయం-8 రాజపూజ్యం-7 అవమానం-3)

వృషభ రాశి 25% అదృష్ట యోగం ఉంది. ఏకాదశంలో రాహు గ్రహం వల్ల రాజగౌరవం, ప్రభుసన్మానం పశులాభం, భోజనసౌఖ్యం, వస్త్ర ప్రాప్తి, వస్తుప్రాప్తి, లాభం మొదలగు శుభ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో చేసే పనుల్లో విజయం ఉంటుంది త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించాలి. మరిన్ని శుభ ఫలితాలకై గురు శని కేతు శ్లోకాలు చదువుకోవాలి. విద్యా విషయంలో ప్రధానంగా గురుబలం అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఏకాగ్రతతో ప్రయత్నించండి. విద్యలో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో గౌరవం గుర్తింపు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉన్నత ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పట్టుదలతో ప్రయత్నం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తిలో మీరు అనుకున్నది సాధించాలంటే కృషి బాగా చేయాలి. గగ్రహదోషం అధికంగా ఉంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. నిరంతర (శ్రమతో పనిచేస్తే వృత్తిలో రాణిస్తారు. వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకొని సత్ఫలితాలు సాధించండి. విదేశ యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. సాంకేతిక లోపం లేకుండా ప్రయత్నించండి. విజయం లభిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు థద్ధ వహించండి. ధనలాభం సామాన్యంగా ఉన్నది. కాబట్టి విశేషమైన (కృషి చేస్తే అధిక లాభాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. భూ గృహ, వాహన యోగాలు అనుకూలంగా ఉన్నాయి. వివాహం కాని వారికి కళ్యాణ ఘడియలు ఆలస్యం అవుతాయి. దైవ బలాన్ని పెంచుకుంటూ ఏకాగ్రతతో ప్రయత్నిస్తేశుభ ఘడియలు వస్తాయి. సంతాన పరంగా సున్నితంగా వ్యవహరించాలి. కుటుంబరీత్యా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనురాగాన్ని పెంచండి. ధర్మ మార్గంలోమీ కర్తవ్యాలు మీరు నిర్వర్తించండి. క్‌ర్తి ప్రతిష్టలు బాగున్నాయి. అరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. కష్ట సుఖాలలో కష్టం అధికంగా ఉంటుంది. సుఖం తక్కువగా ఉన్నది. కాబట్టి పరిస్థితులను అర్ధం చేసుకుంటూ కృషి చేయండి ఫలితం బాగుంటుంది. ఆశయ సాధనలో అధిక శాతం శ్రమ ఉంటుంది, శ్రమను బట్టి విజయం ఉంటుంది. మీ రంగాల్లో మీరు చేస్తున్న కృషిని బట్టి విజయాలు ఉంటాయి. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వ్యవహరిస్తే కార్యసిద్ధి లభిస్తుంది. ఆనందం, సంతృప్తి, మనశ్శాంతి ఈ మూడు మిశ్రమంగా ఉన్నాయి. కష్టేఫలి అన్నవిధంగా ప్రయత్న బలాన్ని బట్టి ఇవి సిద్ధిస్తాయి. పరిస్థితులను అర్ధం చేసుకుంటూ కృషి చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే శీఘ్ర విజయం ఉంటుంది. బుద్ధి బలంతో వివేకంగా ఆలోచించి బంగారు భవిష్యత్తుకు అవసరమైన కృషిని కొనసాగించండి. ఏకాగ్రతతో చేసే ప్రయత్నాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మరియు అభీష్టాలను సిద్ధింపచేస్తాయి. మనోబలంతో కూడిన లక్ష్యం సంకల్పసిద్ధినిస్తుంది.