Skip to content

మేషం

(ఆదాయం-08 వ్యయం-14 రాజపూజ్యం- 04 అవమానం-03)

మేషరాశి వారికి అదృష్ట యోగం 75% చాలా బ్రహ్మాండంగా ఉంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ధనస్థానంలో గురు గ్రహము మనేసౌఖ్యం, కీర్తి సౌభాగ్యం,ధనలాభం, ధర్మ కార్యాచరణను, మరియు, రాజ్య కేంద్రంలో శని గ్రహము ఆరోగ్యం,ధనలాభం, సంతాన ప్ర్‌ప్తి, సంతాన సుఖం, సంతోషం, కార్యసిద్ధి విజయం మొదలగు శుభఫలితాలను, మరియు షష్టంలో కేతు గ్రహము ధైర్యబిద్ధి,వీరుడుకి ఉండేశక్తిని,శత్రునాశనం, శుభం, లాభం, భూలాభాలను ప్రసాదిస్తాడు. మే వరకు గురు బలం తక్కువగా ఉంది. మే నుండి చాలా బాగుంటుంది. ముఖ్య కార్యాల్లో విజయాలు లఖిస్తాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మరన్ని శుభ ఫలితాలు కలగటానికి పూర్వార్థంలో గురుగ్రహ శ్లోకము. సంవత్సరమంతా రాహు గ్రహ శ్లోకము చదువుకోవాలి. విద్యా యోగం శుభప్రదంగా ఉంది, చదువులో మీ ఆశయం నెరవేరుతుంది. అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. కారణం గురుగ్రహం సహకరిస్తోంది. ఏకాదశంలోశని ఏకాగ్రతను ప్రసాదిస్తాడు. ఉద్యో గ ఫలితాలు చాలా బాగుంటాయి. ఏకాదశంలో శని విశేషమైన లాభాన్నిస్తాడు. లాఫాలతో కూడిన వ్యాపార యోగం సూచితం. మంచి అలోచనా విధానంతో పని చేయండి. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. వృత్తిలో మీరు బాగా రాణిస్తారు. వ్యవసాయం రంగంలో చాలా బాగుంటుంది. మంచి పంట లభిస్తుంది. విదేశీ యోగం అనుకూలిస్తుంది. ఆశించిన ఫలితం ఉంటుంది. దైవ సందర్శనార్థం చేసే తీర్థయాత్రలు సహకరిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశయోగంలో ఇబ్బందులు లేవు, ప్రయత్నాలు సఫలం అవుతాయి. మే వరకు ధనలాభం సాధారణంగా ఉంటుంది. మే నుండి శుభప్రదమైన ధనలాభాలు ఉంటాయి. అభివృద్ధి చాలా బాగుంటుంది. భూ, గృహ, వాహన యోగాలు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి కళ్యాణ ఘడియలు మే నుండి బలంగా ఉన్నాయి. మంచి సంతానం సంతానయోగం సూచితం, చిన్న పిల్లల విషయంలో ఆనందాన్ని పొందుతారు. పిల్లల అభివృద్ధిబాగుంటుంది. సంతానం ద్వారా కలిసి వస్తుంది. కుటుంబ సౌఖ్యం, చక్మని వృద్ధి ఉన్నది. కుటుంబపరంగా అనందంగా ఉంటారు. కుటుంబంలోని వ్యక్తులకు మేలు చేకూరుతుంది. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మీ ప్రయత్నాలు సఫలమవడం ద్వారా ఉన్నతమైన మంచి పేరు గౌరవం గుర్తింపు లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి, మొత్తం మీద ఆరోగ్యం చాలా బాగుంటుంది. కష్టసుఖాల విషయంలో కష్టాలు తక్కువగా ఉంటాయి సుఖాలు పెరుగుతాయి. మీమీ రంగాల్లో విశేషమైనటువంటి కృ కృషి చేయండి. బుద్ధిబలంతో విజయం లభిస్తుంది. త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. న్యాయం గెలిపిస్తుంది. ధర్మం రక్షిస్తుంది. శ్రమకు తగినప్రతిఫలం ఉంటుంది. ఆనందం, సంతృప్తి, మనశ్శాంతి. సంవత్సరంలో సంపూర్ణంగా లభిస్తాయి. అనుకున్నది సాధించడం ద్వారా సంతృప్తికరమైన జీవితముఆనందము లభిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి మనోబలంతో సంకల్పసిద్ధి కలుగుతుంది. ఒక ప్రణాళికతో ప్రయత్నం చేయటం ద్వారా లక్ష్యం నెరవేరుతుంది. మార్చ్‌ 29,2025 నుండి మేషరాశికి ఏలినాటిశని ప్రారరభమవుతుంది. శనిధ్యానం మేలు చేస్తుంది.