Skip to content

మిథునం

(ఆదాయం-5 వ్యయం-5 రాజపూజ్యం-3 అవమానం-6)

మిధునరాశివారికి 50% అదృష్ట యోగం ఉంది. మిధునరాశివారికి పూర్వార్ధంలో అనగా మే వరకు గురువు రీర్తివృద్ధి, తేజస్సు, సర్వత్రవిజయం, సుఖం, శత్రువులు మితృవులవటం, మంత్రసిద్ధిని గురువు ఇస్తాడు. మరియు రాహువు దశమ రాజ్య రేంద్రంలో సంతోషం, భోజనసౌఖ్యం, కర్శసిద్ధి శరీరబలం, సర్వసుఖం మొదలగు శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నందున అద్భష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది. దైవబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆశయాలు నెరవేరే విధంగా కృషి చేయండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారు. మే తర్వాత గురుబలం తగ్గుతుంది కాబట్టి గురు శ్లోకం చదువుకోవాలి. మరిన్ని శుభ ఫలితాలు సాధించటం కోసమై శని కేతు శ్లోకాలు చదువుకోవాలి. విద్యా యోగం శుభప్రదంగా ఉంది. విశేషమైన కృషి ద్వారా విద్యలో రాణిస్తారు. మంచి జ్ఞానాన్ని పొందుతారు. ఉన్నత విద్యలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలోశుభ ఫలితాలు సాధిస్తారు. గురు రాహువుల యొక్క సహకారం విజయానిస్తుంది. అధికారయోగంతో కూడిన ఉన్నత పదవీ లాభం కలుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలుఉంటాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారరీత్యా శేష్టమైన ధన లాభం సూచితం. కృషిని బట్టి వ్యాపారంలో తగిన ప్రతిఫలం లభిస్తుంది. లాభాలరూపంలో మీరు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించి మీరు ఉన్నత స్థితిని సాధిస్తారు. స్థిరమైన ఫలితాలు ఉన్నాయి. వ్యవసాయంలో బాగా కలిసి వస్తుంది. మంచి లాభాలు కలుగుతాయి. విదేశ ప్రయత్నాలు సఫలం అవుతాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధిస్తాయి. దైవ సంబంధమైన తీర్ధయాత్రలు చేయటం ద్వారా పుణ్యం లభిస్తుంది. ప్రయాణాలలో మేలు చేకూరుతుంది. ధనలాభం మే వరకు అద్భుతంగా ఉంటుంది. మే తర్వాత ఖర్చులు పెరగకుండా ఉండటం కోసం గురు శ్లోకం చదువుకుంటే మంచి జరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాన్నిబట్టి అభివృద్ధి ఉంటుంది. భూ గృహ, వాహన యోగాలు కలిసి వస్తాయి. ఆశించిన మేరకు ఫలితాలు బాగుంటాయి. పెళ్లి కాని వారికి వివాహఘడియలు మే వరకు అనుకూలంగాజఉన్నాయి. సంతానసౌఖ్యం లభిస్తుంది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. కుటుంబంలోని వ్యక్తులకు మీ నుంచి మంచి జరుగుతుంది. మీ వల్ల కొందరికి మేలు జరగటం ద్వారా సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అరోగ్యంశుభప్రదంగా ఉంటుంది. కష్టాలు తొలగుతాయి. సౌఖ్యం పెరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది, కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది, ప్రయత్న బలాన్ని అనుసరించి విజయం సిద్ధిస్తుంది. నిరంతర సాధనతో కార్యసిద్ధి లభిస్తుంది, ధర్మ మార్గంలో ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు, మీమీ రంగాల్లో సంతృప్తిచెందే విధంగా సాధన చేయండి సుస్థిరతతో కూడినఫలితాలు సిద్ధిస్తాయి. ఆశించిన విధంగా మనశ్శాంతి లభిస్తుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృషి చేయండి మీరు కోరుకున్న విధంగా లక్ష్యం నెరవేరుతుంది. సంకల్పసిద్ధి కలుగుతుంది.