Skip to content

🕉️🌺 హర హర శంకర జయ జయ శంకర 🌺🕉️

శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

ఇండియా లో రెండో సారి కరోనా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తీవ్రంగా ఉంది.
ఇంత వరకు మూఢం కారణంగా ముహూర్తాలు లేక, ఇటుపై ముహూర్తాలు ఉన్నాకాని కరోనా కారణంగా జీవనాధారం లేక, కుటుంబాలు జరగక ఇబ్బంది పడుతున్న వైదిక, పురోహిత కుటుంబాలకు నిత్యావసర సరుకులుసహాయం చేయాలని సంకల్పం.
ఆ కారణంగా

కృష్ణ జిల్లా : విజయవాడ, జగ్గయ్యపేట, ఉయ్యూరు.

పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం,ఇరగవరం, ఆలమూరు, పెనుమంట్ర.

తూర్పు గోదావరి జిల్లా : అన్నవరం, అమలాపురం.

విశాఖ పట్నం జిల్లా :

గుంటూరు జిల్లా : తెనాలి, నర్సరావుపేట, సత్తెనపల్లి.

విజయనగరం జిల్లా: చీపురుపల్లి, రాజాం.

ప్రకాశం జిల్లా : చీరాల, ఒంగోలు.

కడప జిల్లా : కడప, ప్రొద్దుటూరు.

చిత్తూరు జిల్లా : చిత్తూరు.

అనంతపురం జిల్లా : అనంతపురం, పెనుగొండ

కర్నూలు జిల్లా : కర్నూలు.

హైదరాబాద్, వరంగల్, వేములవాడ, సూర్యాపేట మరియు భద్రాచలం ప్రాంతాలలో

నివసిస్తున్న వైదిక, పురోహిత ఒక్కో కుటుంబానికి 20 కేజీల బియ్యం మరియు నాలుగు నిత్యావసర సరుకులు ఈ శ్రీ ప్లవ నామ సంవత్సరము వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో వీలైనంత వరకు 150 కి పైగా కుటుంబాలకు అందించుటకు మన సనాతన ధర్మ భారతి సమూహం నుండి పై కార్యక్రమానికి సహాయం చేయడానికి నన్ను సంప్రదించగలరు.

పై సహాయార్ధం ప్రస్తుతం ఈ క్రింది ప్రాంతాలలో నివసిస్తున్న వైదిక, పురోహిత కుటుంబాల గోత్ర నామాలు వివరాలు మన అనుబంధ మరియు సనాతన ధర్మ భారతి గ్రూప్ సభ్యులు సేకరిస్తున్నారు.

ఇప్పటి వరకు రెండు విడతలుగా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా లలో 26 వైదిక, పురోహిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు సహాయం చేయడం జరిగింది.

పూర్తి వివరాలకు సంప్రదించండి.
🙏🙏🙏
సనాతన ధర్మ భారతి
sanathanadharmabharathi@gmail.com